ఆ బీటీ బ్యాచ్‌తో చర్చలు జరపం: అశ్వత్థామ రెడ్డి

ఆ బీటీ బ్యాచ్‌తో చర్చలు జరపం: అశ్వత్థామ రెడ్డి

Last Updated : Oct 17, 2019, 10:34 PM IST
ఆ బీటీ బ్యాచ్‌తో చర్చలు జరపం: అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పలువురు మంత్రులు చేస్తున్న ప్రకటనలు తమకు ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వడంలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ సాధన కోసం కృషిచేసిన మంత్రులు మాట్లాడటం లేదన్న అశ్వత్థామ రెడ్డి.. తాము ఉద్యమ మంత్రులతోనే చర్చలు జరుపుతామని, బీటీ బ్యాచ్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ డిమాండ్లను సాధించుకునే వరకు సమ్మె విరమించేది లేదని అశ్వత్థామ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.

Trending News