TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..బస్‌ టికెట్‌తోపాటే దర్శన టోకెన్..!

TSRTC: టీఎస్‌ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 1, 2022, 02:14 PM IST
  • టీఎస్‌ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం
  • సామాన్యులకు దగ్గరయ్యేలా నిర్ణయం
  • వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..బస్‌ టికెట్‌తోపాటే దర్శన టోకెన్..!

TSRTC: టీఎస్‌ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లనున్న భక్తులకు బస్‌ టికెట్‌తోపాటు స్వామి దర్శన టికెట్‌ అందించనున్నారు. తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్ టికెట్‌తోపాటు శ్రీవారి దర్శన టికెట్ పొందేలా ఏర్పాట్లు చేశారు. దీనిని ఇవాళ్టి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

ప్రతి రోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఈమేరకు టీఎస్‌ఆర్టీసీ, టీటీడీ మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. తిరుమలకు బస్ టికెట్ బుక్‌ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా డీలర్ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో గానీ టికెట్ బుకింగ్‌ కౌంటర్లలో గానీ ప్యాకేజీ కోసం వారం ముందు టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

భాగ్యనగరంలో ఇంటింటికి పార్సిళ్ల చేరవేతకు పోస్టల్ శాఖ ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రెండు విభాగాల అధికారులతో బస్‌భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 110 పిన్‌ కోడ్ సెంటర్లు ఉన్నాయని..తొలి దశలో 27 ప్రాంతాల్లో హోం డెలివరీ పార్సిల్ సేవలను ప్రారంభిస్తామన్నారు. దశల వారిగా మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని..ఇప్పటికే ఆర్టీసీ ద్వారా రోజుకు 18 వేలకు పైగా పార్సిళ్లను చేరవేస్తున్నామని స్పష్టం చేశారు.

Also read: Viral Video Today: బాబుకు రక్షణగా పెంపుడు కుక్క.. ఇది బాబును ఏం చేసిందో తెలుసా..!

Also read:Amaravathi: అమరావతి ఉద్యోగులకు శుభవార్త..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News