హైదరాబాద్: కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో సోమవారం ఉదయం బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన మరొక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తుగా ప్రయాణికులు ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదు. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడిన ప్రయాణికులు వెంటనే బస్సులోంచి దిగి బయటికొచ్చేశారు. హైదరాబాద్ డిపో-2కు చెందిన బస్సుపై తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లో చేరిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని... ఆ సమయంలో డ్రైవర్ మద్యం మత్తులోనూ ఉన్నాడని భావించిన స్థానికులు డ్రైవర్ను అక్కడే చితక్కొట్టినట్టు తెలుస్తోంది.