టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 'కీ' 2018: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్స్

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 'కీ' 2018: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్స్

Last Updated : Oct 13, 2018, 11:09 AM IST
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 'కీ' 2018: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్స్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అక్టోబర్ 7వ తేదీన నిర్వహించిన గ్రూప్‌-4 రాతపరీక్షకు సంబంధించిన డిజిటల్ జవాబు పత్రాలను (ఓఎంఆర్) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్‌లను అధికారిక వెబ్‌సైట్‌‌ tspsc.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు డౌన్‌లోడ్ చేసుకొనే సమయంలో సాంకేతిక సమస్యలు ఏవైనా తలెత్తినా లేదా జవాబు పత్రాలు సరిగా డౌన్‌లోడ్‌ కాకపోయినా వెంటనే టీఎస్‌పీఎస్సీ అధికారులను సంప్రదించాలని కోరింది.

అక్టోబర్ 7, 2018 ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరిగింది.

మొత్తం 1,867 ఉద్యోగాలకు (గ్రూప్-4, ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్, జీహెచ్‌ఎంసీ బిల్‌ కలెక్టర్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు) 4,80,545 మంది అభ్యర్థులు పరీక్షలు రాయడానికి అర్హత సాధించారు. వీరిలో 3,12,397 మంది పేపర్-1 పరీక్ష రాయగా.. 3,09,482 మంది పేపర్-2 పరీక్ష రాశారని.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 65% అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని, వీరికోసం 1,046 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పరీక్ష అనంతరం అధికారులు తెలిపారు.

ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్స్‌ను టీఎస్‌పీఎస్సీ అందుబాటులోకి తీసుకురాగా...  గ్రూప్-4 రాతపరీక్షకు సంబంధించిన 'కీ' ని ఇవాళ లేదా రేపు విడుదల చేయనున్నారని సమాచారం.

అభ్యర్థులు ఓఎంఆర్ షీట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News