Group 1 Application Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్.. తప్పులు సవరించుకునేందుకు మరో అవకాశం

Group 1 Application Editing Last Date Extended: గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. 

Written by - Pavan | Last Updated : Jul 21, 2022, 08:02 PM IST
  • గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్
  • తుది గడువు పొడిగిస్తూ మరోసారి టిఎస్పీఎస్సీ ఉత్తర్వులు
  • దరఖాస్తుదారుల విజ్ఞప్తి మేరకు టిఎస్పీఎస్సీ నిర్ణయం
Group 1 Application Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్.. తప్పులు సవరించుకునేందుకు మరో అవకాశం

Group 1 Application Editing Last Date Extended: గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు నేడు సాయంత్రం 5 గంటల వరకే గడువు ముగిసిపోగా.. తాజాగా మరోసారి తుది గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. టిఎస్పీఎస్సీ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నెల 28వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా సర్టిఫికెట్స్ పొందడంలో, ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్లడంలో విఫలమైన వారు మరో అవకాశం కల్పించాల్సిందిగా చేసుకున్న విజ్ఞప్తి మేరకు దరఖాస్తులో సవరణల గడువు పెంచినట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తేల్చిచెప్పింది.

ఈ ఏడాది ఏప్రిల్ 26న వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ టిఎస్‌పీఎస్‌సి జూలై 12న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

Also Read : Polavaram war : కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయా! ఏపీ మంత్రి ఆరోపణలు నిజమేనా ?

Also Read : Godavari Floods: గోదావరి వరదలపై మావోయిస్టుల సంచలన లేఖ! మరీ ఇంత దారుణం జరిగిందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News