TSPSC: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు... అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన...

Telangana Job Notifications: త్వరలో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ కీలక సూచన చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 08:06 PM IST
  • ఉద్యోగ అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన
  • అభ్యర్థులకు ఓటీఆర్ తప్పనిసరి
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
TSPSC: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు... అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన...

Telangana Job Notifications: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో నిరుద్యోగులంతా జాబ్ ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అభ్యర్థులకు కీలక సూచన చేసింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరి అని సూచించింది. 

గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లు కొత్త జిల్లాలకు అనుగుణంగా తమ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హతల వివరాలను నమోదు చేయాలని తెలిపింది. చివరి నిమిషం వరకు ఆలస్యం చేయకుండా ముందు గానే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి :

టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి.. 'న్యూ రిజిస్ట్రేషన్‌'పై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్ అడిగిన చోట మీ నంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.

దరఖాస్తు ఫారంలో పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీ, విద్యార్హతలు తదితర వివరాలు నమోదు చేయాలి.

అభ్యర్థి ఫోటోతో పాటు సంతకం అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అనంతరం ఆ కాపీని ప్రింటవుట్ తీసుకోవాలి.

ఒకవేళ ఓటీఆర్‌లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే.. ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 

తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో 30,452 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కూడా ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురూ అవడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు.

Also Read: PAN-Aadhaar link: రేపే లాస్ట్ డేట్.. ఆధార్​-పాన్ లింక్ చేయకుంటే రూ.1,000 జరిమానా!

Also Read: కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News