TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఐసెట్‌ ( TS ICET-2020 ) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ర్టం‌లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ ప్రక్రియ ప్రారం‌భమవుతుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

Last Updated : Dec 3, 2020, 09:05 AM IST
  • తెలంగాణ ఐసెట్‌ ( TS ICET-2020 ) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది.
  • మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి.. ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 6 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అనంతరం 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు
TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TS ICET-2020 Counselling dates announced: హైదరాబాద్‌: తెలంగాణ ఐసెట్‌ ( TS ICET-2020 ) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ర్టం‌లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి ఐసెట్‌ కౌన్సె‌లింగ్‌ ప్రక్రియ ప్రారం‌భమవుతుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను బుధవారం ప్రకటించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి.. ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 6 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు 8 నుంచి 12 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఉన్నత విద్యామండలి (telangana higher education) వెల్లడించింది. వెబ్ ఆప్షన్ల అనంతరం 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. 

22నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. 
అలాగే ఈ నెల 22నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 22న స్లాట్‌ బుకింగ్‌, 23న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అనంతరం 22 నుంచి 24 వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 26వ తేదీన చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. అనంతరం 28వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ( Telangana ) ఉన్నత విద్యామండలి పేర్కొంది. Also read: 
Yada Krishna: టాలీవుడ్ నటుడు కన్నుమూత

అయితే.. ఐసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. రేపటితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుండటంతో తాజాగా ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. Also read: GHMC Elections: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ ప్రారంభం

Also Read | Pawan Kalyan: పిల్లల‌తో ప‌వ‌న్.. ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News