Mariyamma lockup death case: మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు సీరియస్

mariyamma lockup death case:మరియమ్మ లాకప్ డెత్ (mariyamma lockup death) సీబీఐకి (CBI) అప్పగించదగిన కేసు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు (high court) నోటీసులు జారీ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 06:50 PM IST
  • యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై హైకోర్టులో విచారణ
  • మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసు అని అభిప్రాయపడిన హైకోర్టు
  • పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని పేర్కొన్న హైకోర్టు
Mariyamma lockup death case: మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు సీరియస్

TS high court hearing on mariyamma lockup death case: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై హైకోర్టులో విచారణ కొనసాగింది. పీయూసీఎల్‌ దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ లాకప్ డెత్ (mariyamma lockup death) సీబీఐకి (CBI) అప్పగించదగిన కేసు అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు (high court) నోటీసులు జారీ చేసింది.

మరియమ్మ మృతిపై (mariyamma death) హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించిన మెజిస్ట్రేట్‌ను (Magistrate) కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది. ఇక మరియమ్మ మరణానికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని ఏజీ ప్రసాద్ తెలిపారు. అలాగే మరియమ్మ కుటుంబానికి పరిహారం కూడా చెల్లించినట్లు చెప్పుకొచ్చారు.

Also Read : JC, Paritala greet each other: అనంత రాజకీయాల్లో పెను మార్పులు.. ఒక్కటైన జేసీ, పరిటాల కుటుంబాలు

దీనిపై హైకోర్టు స్పందించింది. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని హైకోర్టు పేర్కొంది. ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని అడ్వకేట్ (Advocate) జనరల్ ధర్మాసనానికి తెలపడంతో.. రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని.. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసు విషయంలో సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని హైకోర్టు (high court) అభిప్రాయపడింది. సీబీఐ, (CBI) కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

Also Read : Mother sells 3day old son : పేద‌రికంతో పేగుబంధాన్ని అమ్ముకున్న తల్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News