TS CPGET Results 2020: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TS CPGET Results 2020) ఫలితాలు విడుదలయ్యాయి. నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సులు (ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ)లలో సీట్ల భర్తీకి ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) ఈ పరీక్ష నిర్వహించింది. నేడు ప్రొఫెసర్ ప్రాపిరెడ్డి సీపీగెట్ ఫలితాలు(TS CPGET 2020 Results) విడుదల చేశారని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య కిషన్ తెలిపారు. అభ్యర్థులకు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచిట్లు పేర్కొన్నారు. కరోనా తర్వాత వస్తున్న ఫలితాలు కావడంతో విద్యార్థులలో ఆసక్తి నెలకొంది. TS CPGET Results 2020 Link 1
సీపీగెట్ 2020 ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ(Telangana) యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూ క్యాంపస్, అనుబంధ కళాశాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తాయి.
అధికారిక వెబ్సైట్ కోసం క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook