TS COVID-19 latest updates: హైదరాబాద్: తెలంగాణలో తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా వారిలో 324 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తం 6,62,526 కి చేరింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 79 కేసులు గుర్తించారు. అదే సమయంలో కరోనా వైరస్ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.
గత 24 గంటల్లో 280 మంది కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య మొత్తం 6,53,302 మందికి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ (COVID-19) కారణంగా 3,899 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
Also read : AP Corona Cases: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..కొత్తగా 1,125 పాజిటివ్ కేసులు
జోగులాంబ, కొమరం భీమ్ అసిఫాబాద్, ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాల్లో బుధవారం ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు (Coronavirus positive cases) కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 5 లేదా అంతకంటే తక్కువ సంఖ్యలో నమోదైన జిల్లాల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్ కర్నూలు, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి.
Also read : Covid Vaccination:కొవిడ్ వ్యాక్సినేషన్లో రికార్డు సృష్టించిన భారత్, ప్రపంచంలోనే అత్యధికంగా టీకాల పంపిణీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook