బాలుడిని 2 కి.మీ లాక్కెళ్లిన లారీ

వరంగల్‌ రూరల్ జిల్లాలోని నడికూడా మండల ( Nadikuda ) కేంద్రంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తుగా రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ తీగలకు తగిలిన ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

Last Updated : May 23, 2020, 01:20 AM IST
బాలుడిని 2 కి.మీ లాక్కెళ్లిన లారీ

వరంగల్‌ రూరల్‌ : జిల్లాలోని నడికూడా మండల ( Nadikuda ) కేంద్రంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తుగా రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ఘటనలో తెగిన విద్యుత్ వైర్లు లారీకి చుట్టుకోవడంతో పాటు అదే సమయంలో అటువైపుగా రోడ్డుపై నడిచి వెళ్తున్న 12 ఏళ్ల బాలుడికి చుట్టుకున్నాయి. కానీ అదేమీ గ్రహించని లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో లారీ బాలుడిని అలా 2 కిలో మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. అయినప్పటికీ లారీ డ్రైవర్ లారీని ఆపకపోవడంతో అది గమనించిన గ్రామస్తులు బైకుల సహాయంతో లారీని వెంబడించి అడ్డుకున్నారు.  Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు )

ఈ ప్రమాదంలో అప్పటికే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు ( Minor boy injured ). తీవ్రగాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు ఆస్పత్రికి ( Warangal MGM hospital ) తరలించారు. బాలుడి గాయాలను పరిశీలించిన వైద్యులు.. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News