కొండా సురేఖ తిరుగుబాటు.. ఇండిపెండెంట్లుగా నిలబడినా గెలుస్తామని ధీమా

                      

Last Updated : Sep 25, 2018, 05:12 PM IST
కొండా సురేఖ తిరుగుబాటు.. ఇండిపెండెంట్లుగా నిలబడినా గెలుస్తామని ధీమా

హైదరాబాద్: కేసీఆర్ నాయకత్వంపై టీఆర్ఎస్ మహిళా నేత కొండా సురేఖ ధిక్కార స్వరాన్ని మరోసారి వినిపించారు. పార్టీ  నేతలకూ అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. అహంకారానికి నిలువెత్తు నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో భర్త కొండా మురళీతో కలిసి ఆమె ప్లెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్  పార్టీకి రాజీనామా విషయంలో ఒకటీ రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని.. తన భర్త కొండా మరుళీ కానీ తన కూతురు ఇద్దరిలో ఒకరు పోటీ చేస్తారని ప్రకటించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా తమ ప్రభావం ఉందని.. మేం ఇండిపెండెంట్లుగా నిలబడిన తప్పకుండా గెలుస్తామని  కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. 

అంతా అవినీతి మయం...
కేసీఆర్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా... రాష్ట్రంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని కొండా సురేఖ విమర్శించారు. టీఆర్ఎస్  పాలన అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. ప్రతి పనికి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని .. రాష్ట్రంలో విచ్చలవిడిగా బార్లకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. మహిళలంటే కేసీఆర్ కు గౌవరం ఉంటే ఒక్క మంత్రి పదవి అయినా ఇచ్చి ఉండేవారని విరమ్శించారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేని అసమర్ధ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని టీఆర్ఎస్ రెబల్ నేత కొండా సురేఖ దయ్యాబట్టారు.

 

Trending News