Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో డీఎస్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు... చేరిక ఎప్పుడంటే..

Dharmapuri Srinivas Joining Congress: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన సొంత గూటికి చేరనున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 04:21 PM IST
  • కాంగ్రెస్‌లోకి డీఎస్ రీఎంట్రీ
  • ఈ నెల 24న సోనియా సమక్షంలో పార్టీలో చేరిక
  • మరో ఐదు నెలల్లో ముగియనున్న రాజ్యసభ పదవి
Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో డీఎస్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు... చేరిక ఎప్పుడంటే..

Dharmapuri Srinivas Joining Congress: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన సొంత గూటికి చేరనున్నారు. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటం గమనార్హం. నిజానికి డీఎస్ కాంగ్రెస్ రీఎంట్రీ ఆలస్యమైందనే చెప్పాలి. గతేడాది డిసెంబర్ 16న సోనియాతో భేటీ అయినప్పుడే.. పార్టీలో ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జరిగింది. కానీ అనుకోని కారణాలతో చేరిక వాయిదా పడింది.

తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డీఎస్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. డీఎస్‌కు మొదట ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత రాజ్యసభకు పంపించారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో నిజామాబాద్‌ జిల్లా టీఆర్ఎస్ నేతలు డీఎస్‌పై ఫిర్యాదు చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 

అప్పటినుంచి డీఎస్ పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే రాజ్యసభ పదవికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. పైగా దమ్ముంటే తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అయినప్పటికీ టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో ఇప్పటికీ ఆయన రాజ్యసభ పదవిలో కొనసాగుతున్నారు. మరో ఐదు నెలల్లో డీఎస్ రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. 

నిజానికి డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ఆ పార్టీకి కలిగే ప్రయోజనమేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకురావడంలో డీఎస్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. వయసు రీత్యా ఆ స్థాయిలో ఇప్పుడాయన పనిచేయగలుగుతారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే డీఎస్ చేరికతో మున్నూరు కాపు సామాజికవర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: రోహిత్ శర్మ కాదు.. కేఎల్ రాహుల్ కాదు! టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?!

Also Read: Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News