Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి అప్పుడు ఎక్కడున్నాడు ? కల్వకుంట్ల కవిత కౌంటర్

Revanth Reddy vs Kalvakuntla Kavitha: త్యాగాలు ఒకరివైతే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే ఎలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత అదే ట్విటర్ ద్వారా రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Nov 30, 2022, 06:22 AM IST
  • వంటావార్పులతో పప్పన్నం తిన్నందుకు మీకు పదవులా: రేవంత్ రెడ్డి
  • మీవే త్యాగాలైతే శ్రీకాంతా చారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్యలవి ఏంటని ప్రశ్న
  • రేవంత్ రెడ్డి ప్రశ్నలకు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి అప్పుడు ఎక్కడున్నాడు ? కల్వకుంట్ల కవిత కౌంటర్

Revanth Reddy vs Kalvakuntla Kavitha: వంటావార్పులో పప్పన్నం తినడమే... బతుకమ్మ ఆడటమే... బోనం కుండలు ఎత్తడమే... త్యాగాలు అనుకుంటే తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలను ఏమనాలి అని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ ద్వారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. త్యాగాలు ఒకరివైతే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే ఎలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత రివర్స్ కౌంటర్ ఇచ్చారు.  

 

మహిళలు, బతుకమ్మ, బోనాలను రేవంత్ రెడ్డి కించపరిచారంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల నోట బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసి వారి చేత బతుకమ్మ ఎత్తించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే అవుతుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై " తుపాకీ " ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకే పరిమితం చేస్తూ మాట్లాడడం అనేది మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది అని ఫైర్ అయ్యారు. 

 

మిలియన్ మార్చ్, సాగరహారం , అసెంబ్లీ ముట్టడిలో మేము ఆడబిడ్డలము ముందున్నాం. మరి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎక్కడంటూ ఎమ్మెల్సీ కవిత వరుస ప్రశ్నలు సంధించారు. నవంబర్ 29 దీక్ష దివాస్ అంటూ ఆనాడు తన తండ్రి కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేపట్టి చేసిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తుచేస్తూ కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ కి స్పందిస్తూ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరో ట్వీట్ చేయడంతో మొదలైన ఈ ట్వీట్స్ యుద్ధం అలా నడుస్తూనే ఉంది.

Also Read : Meadaram Jathara 2023: మేడారం మిని జాతరకు తేదీలు ఖరారు

Also Read : Kalvakuntla Kavitha: అవి కాంగ్రెస్ చేసిన హత్యలే.. కల్వకుంట్ల కవిత ఫైర్

Also Read : YS Sharmila: ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన షర్మిల అరెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News