TRS MLA: జాతీయ జెండాలో గులాబీ రంగు.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

TRS MLA: దేశమంతా  75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని  ఘనంగా జరుపుకుంటోంది.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం జాతీయ జెండా విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది

Written by - Srisailam | Last Updated : Aug 4, 2022, 03:08 PM IST
  • జాతీయ జెండాలో గులాబీ రంగు
  • వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నెటిజన్ల ఫైర్
TRS MLA: జాతీయ జెండాలో గులాబీ రంగు.. వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

TRS MLA: దేశమంతా  75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని  ఘనంగా జరుపుకుంటోంది.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నాయి.
 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  వేడుకల్లో భాగంగా ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇందులో భాగంగా ఆగస్టు 13,14, 15వ తేదీల్లో దేశంలోని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలిపిచ్చారు.
ప్రజల్లో దేశ భక్తి పెంపోందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసినట్లు మోడీ సర్కార్ ప్రకటించింది.

తెలంగాణ సర్కార్ కూడా స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేందుకు కోటి20 లక్షల జెండాలను తయారు చేసింది కేసీఆర్ సర్కార్. ఈనెల 9 నుంచి జెండాలు పంపిణి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం జాతీయ జెండా విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. జాతీయ జెండాను టీఆర్ఎస్ ఎమ్మెల్యే అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి.

కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండా వివాదంలో చిక్కుకున్నారు. త్రివర్ణ పతాకంలో మధ్యలో తెలుపు రంగు ఉంటుంది. కాని తెలుపు రంగు స్థానంలో టీఆర్ఎస్ పార్టీని సూచించేలా గులాబీ రంగు పెట్టారని ఎమ్మెల్యే రేగా కాంతారావు పై విమర్శలు వస్తున్నాయి. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా రేగా కాంతారావు ఫోటోతో కలిగిన బ్యానర్లను ఆయన అనుచరులు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో జాతీయ జెండాలోని త్రివర్ణ పతాకంలో తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు పెట్టారు. ఇందుకు   బ్యానర్ల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే  రేగా కాంతారావు ఫోటోతో ఉన్న బ్యానర్‌లో జాతీయ జెండాలో గులాబీ కలర్ ఉండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read:YSRCP Leaders: ఏపీలో వివాదాస్పదమవుతున్న వైసీపీ నేతల తీరు..ఆ పార్టీ అధిష్టానం సీరియస్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News