రెండుతో రాష్ట్రాన్ని సాధించినోళ్లం..16 మందితో హక్కులను సాధించలేమా ? - కేటీఆర్

                                

Last Updated : Mar 20, 2019, 05:40 PM IST
రెండుతో రాష్ట్రాన్ని సాధించినోళ్లం..16 మందితో హక్కులను సాధించలేమా ? - కేటీఆర్

టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షడు కేటీఆర్ మరోమారు ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్,బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచకుపడ్డారు.తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 272 మంది సభ్యుల బలం అవసరం..ఇప్పటి పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీలకు ఆ స్థాయిలో సొంతంగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు.. అలాగని ఎన్డీయే,యూపీఏ కూటములకు ఆ పరిస్థితి లేదు. సర్వేలు చూసినా ఎన్డీయేకు 150 - 160 సీట్లు, యూపీయేకు 100 -110 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కనబడటంలేదు.

కీలకంగా మారిన ఫెడరల్ ఫ్రంట్

మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఈ రెండు పార్టీలను నమ్మె పరిస్థితి కనిపించడం లేదు. సరైన వేదిక లేకపోవడం వల్లే కొన్ని పార్టీలు..ఏదో కూటమితో జతకడుతున్నాయి తప్పితే ఇష్టపూర్వకంగా దోస్తీ చేయడం లేదు. ఇలాంటి స్థితిలో ఒక్కటే ప్రత్యామ్నాయం.. అదే ఫెడరల్ ఫ్రంట్...వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సర్వేలు కోడై కూస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను ఏకంగా చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ వేదికగా ఉంటుందని.. పార్టీలను ఏకం చేయడంలో టీఆర్ఎస్‌దే కీలక పాత్ర కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో ఈ ఎన్నికల్లో గెలిచే ఒక్కో ఎంపీ ఎంతో కీలకం కాబోతున్నారు కేటీఆర్ పేర్కొన్నారు

ఏం చేస్తామో గెలిచిన తర్వాత చూపిస్తాం

కేటీఆర్ మాట్లాడుతూ కొందరు చెబుతున్నారు...  16 సీట్లిస్తే కేంద్రంలో సర్కార్‌ను నిర్ణయిస్తారా? అంటూ చాలా మంది హేళనగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్‌.... మరి 16 మంది ఎంపీలను మద్దతుతో కేంద్రం మెడలు వంచలేమా అంటూ విమర్శకులకు కేటీఆర్ ఎదురు ప్రశ్న వేశారు. ప్రజలు ఓటు వేసే ముందు ఒక్క సారి ఆలోచించాలి... కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌కు లాభం.. భాజపాకు ఓటేస్తే  మోదీకి లాభం. తెరాసకు ఓటేస్తే తెలంగాణకు లాభం. ఢిల్లీని శాసించి తెంగాణకు రావాల్సినవి తెచ్చుకోవాలి తప్ప యాచించే పరిస్థితి ఉండొద్దంటే 16 మంది గులాబీ సైనికులను గెలిపించాలని ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలను కేటీఆర్ కోరారు 

Trending News