తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి నడుచుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. 2017 ఏప్రిల్‌లో శ్రీరామ నవమిని పునస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించగా దానిపై అదే ఏడాది నవంబర్ లో ఓ కేసు నమోదైందని గతంలో జరిగిన ఈ రెండు ఘటనలను ట్విటర్ ద్వారా గుర్తు చేసిన రాజాసింగ్.. ఆ కేసుకు సంబంధించిన కాపీ తనకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అందింది అని అందులో పేర్కొన్నారు. రేపు ఉదయం 10 గంటలకు తనను పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారని చెబుతూ.. తనపై ఎటువంటి ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ సందర్భంగా రాజా సింగ్ స్పష్టంచేశారు. అంతేకాకుండా తనపై ఒత్తిళ్లు తీసుకురావాలనుకోవడం ఓ విఫలయత్నమే అవుతుందని రాజా సింగ్ ధీమా వ్యక్తంచేశారు.
#TRS is working very hard under the pressure of MIM. Sri #RamNavami Shobha Yatra was in April 2017. Complaint registered in Nov'2017 & received the copy today at 4 PM & asked me to appear tomorrow at 10 AM. No pressure would work against me. It's a FAILED plan. @KTRTRS @AmitShah pic.twitter.com/kvY5hLw3HX
— Raja Singh BJP MLA (@TigerRajaSingh) September 20, 2018