Traffic Diversion Hyderabad: సికింద్రాబాద్ నుంచి బేగంపేట్‌కి వెళ్లే ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనాలను దారిమల్లింపు చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కరాచీ బేకరీ, రసూల్‌పురా, పికెట్ నాలాపై వంతెన పునర్నిర్మాపనులు జరుగుతున్నా నేపథ్యంలో 21 నుంచి జూన్ 4 వరకు నలభై ఐదు రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రజల భద్రత, సంక్షేమం, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నమన్నారు.
అనుమతి ఉన్న మార్గాలు..అనుమతి లేని మార్గాలు:
అయితే సికింద్రాబాద్ సీటీలో నుంచి రసూల్‌పుర జంక్షన్ గుండా వచ్చే వాహనాలు హనుమాన్ దేవాలయం వద్ద ఎడమకు తిరిగి పీజీ రోడ్డు మీదుగా రాంగోపాల్‌పేట్ ఠాణా, మినిస్టర్ రోడ్డుల మీదుగా రసూల్‌పుర జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. బేగంపేట్ ఫ్లైఓవర్ మీదిగా నుంచి వెళ్లే ట్రాఫిక్ కిమ్స్ ఆస్పత్రి రసూల్‌పురా టీ జంక్షన్ నుంచి కుడివైపు వెళ్లేందుకు అనుమతి లేదు. తప్పని సరి క్రమంలో కూడా ఆ వైపు వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ఈ ట్రాఫిక్ నేరుగా సీటీఓ జంక్షన్‌కు వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఎస్పీరోడ్డు వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్ గుండా ఫుడ్‌వరల్డ్ రాంగోపాల్‌పేట్ ఠాణా వైపుగా రసూల్‌పురా టీజంక్షన్‌కు వెళ్లేందుకు వన్‌వే ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ గూడ్స్ వాహనాలు, ప్రైవేట్ బస్సులు, స్కూల్, కళాశాలలకు సంబంధించిన బస్సులు సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ గుండా వెళ్లేందుకు ఏమాత్రం అనుమతి లేదు.
కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గాలు:
పంజాగుట్ట గుండా వచ్చే వాహనాలు:
గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్ ప్లైఓవర్ నుంచి వచ్చే ట్రాఫిక్ CTO ప్లైఓవర్ కింద ఉన్న యూ టర్న్ వద్ద యూ టర్న్ తీసుకుని హనుమాన్ ఆలయం వద్ద ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్ వద్ద ఎడమ వైపు నుంచి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది.
సికింద్రాబాద్ గుండా వచ్చే వాహనాలు:
సికింద్రాబాద్ సీటీఓ జంక్షన్ నుంచి ప్యారడైజ్ గుండా రాణిగంజ్ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని మినిస్టర్ రోడ్డుకు చేరుకుని కిమ్స్ ఆసుపత్రికి చేరుకోవచ్చు.
కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం గుండా వచ్చేవి:
అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ వద్ద ఎడమ వైపు ఉన్న మలుపు తీసుకుని మినిస్టర్ రోడ్డు, బుద్దభవన్, నల్లగుట్ట ఆర్‌యూబీ, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ ఆసుపత్రికి చేరుకోవచని తెలిపారు.
Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు?
Also Read: పట్టు వస్త్రంపై రామాయణం.. 32 వేల సార్లు 'జై శ్రీరామ్' నామం... చీరపై చేనేత కళాకారుడి అద్భుత డిజైన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook