ఒక్క పంపును ప్రారంభిస్తే.. ప్రాజెక్టు పూర్తయినట్టా..? కేసీఆర్ పై రేవంత్ ఫైర్

31 పంపులను ఏర్పాటు చేయాల్సింది.. కేవలం ఒక్క పంపును ప్రారంభించి.. ప్రాజెక్ట్ పూర్తయిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు  ప్రచారం చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..  ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2023, 09:28 PM IST
  • పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారా?
  • ఒక్క పంపును ప్రారంభిస్తే.. ప్రాజెక్టు పూర్తయినట్టా?
  • బీఆరెస్ కు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
  • కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదు.. అభివృద్ధి జరగలేదు.
  • అనుచరులతో కాంగ్రెస్ లో చేరిన కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి
ఒక్క పంపును ప్రారంభిస్తే.. ప్రాజెక్టు పూర్తయినట్టా..? కేసీఆర్ పై రేవంత్ ఫైర్

కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని అభివృద్ధి జరగలేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.  పూర్తి కాకుండానే ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క పంప్ ను ప్రారంభించి ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్ లో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. "గతంలో నేను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డిగారు అండగా నిలబడ్డారు. నా రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి నాకు అండగా నిలబడ్డారు. 2009లో టీడీపీతో టీఆరెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించారు. అప్పుడు కేసీఆర్ గెలుపులో కొత్తకోట దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు" అని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని, సీతక్కను కూడా  రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని భరోసానిచ్చారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమన్నారు.  "ఈ నెల 16,17,18న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఇతర జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరికి భారీగా తరలిరండి" అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Diabetes Tips: రోజూ ఈ ఐదు కూరగాయలు తింటే..మధుమేహం ఎంత ఉన్నా ఇట్టే మాయం

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మానకొండూరు బీఆరెస్ నేతలు
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్ తో సహా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

విజయభేరీ సభావేదికకు భూమిపూజ
ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి సభ  నిర్వహించనున్న నేపథ్యంలో సభా వేదిక ఏర్పాటు కోసం ఇవాళ భూమిపూజ నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే,  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మధుయాష్కీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రౌండ్ ను సందర్శించి.. సభా వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేరారు.

Also Read: IND Vs PAK Match Updates: పాక్ బౌలర్లకు టీమిండియా చుక్కలు.. సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News