Revanth Reddy: మత విద్వేషాలు, విధ్వంసమే గుజరాత్ మోడల్! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్‌ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు.

Written by - Srisailam | Last Updated : Aug 30, 2022, 04:21 PM IST
  • బీజేపీ, టీఆర్ఎస్ పై కేసీఆర్ ఫైర్
  • మత విద్వేషాలే గుజరాత్ మోడల్- రేవంత్
  • కమీషన్లే తెలంగాణ మోడల్- రేవంత్
Revanth Reddy: మత విద్వేషాలు, విధ్వంసమే గుజరాత్ మోడల్! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్‌ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. సొంత ఇమేజ్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలకు కేసీఆర్ దోపి పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మోడల్ అంటూ  కేసీఆర్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని.. అయితే తెలంగాణ మోడల్ అంటే
కమీషన్‌లు, కాంటాక్ట్‌లు అని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

ఇక బీజేపీ నేతలు చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు, ఆస్తులు విధ్వంసం చేయడమేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి మోడల్ తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, టీఆర్ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని రేవంత్ అన్నారు.మునుగోడులోనూ ఈ రెండు పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని అన్నారు. పోటీపడి మరీ ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నేతలను అంగడి సరుకుగా మార్చేశాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో నేతల జేబులు నిండాయి తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఛార్జ్ షీట్ విడుదల చేసి.. ఇంటి ఇంటికి ప్రచారం చేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సీనియర్ నేత  గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు రేవంత్ రెడ్డి. . కొందరు నేతలు పార్టీ మారుతూ అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. గులాంనబీ ఆజాద్ ప్రధాని మోడీకి గులాంగా మారారని మండిపడ్డారు. ఆజాద్ కు కాంగ్రెస్‌ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. గుజరాత్‌లో జరిగిన నరమేథం ఆజాద్ మర్చిపోయారా అని నిలదీశారు.తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాలు గులాబీ పార్టీ ఈవెంట్లగా మారిపోయాయన్నారు. తన లోక్ సభ పరిధిలో రెండు కలెక్టరేట్లను ప్రారంభించినా తనకు ఆహ్వానం రాలేదన్నారు.

Read Also; సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా జల్సా రీ రిలీజ్ ట్రైలర్.. మహేష్ వాయిస్ ఓవర్ తో రచ్చ!

Read Also; Kadium Counter: ఘనపూర్ నీ జాగీరా.. ఒళ్ళు దగ్గర పెట్టుకో ! ఎమ్మెల్యే రాజయ్యకు కడియం కౌంటర్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News