తెలంగాణలో జిల్లాల వారీగా COVID-19 లేటెస్ట్ అప్‌డేట్స్

‌తెలంగాణలో బుధవారం కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు (COVID-19 positive cases) నమోదయ్యాయి. ఈ 11 కరోనా కేసులు కూడా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల మొత్తం 1,107 కు చేరుకుంది.

Last Updated : May 7, 2020, 12:15 AM IST
తెలంగాణలో జిల్లాల వారీగా COVID-19 లేటెస్ట్ అప్‌డేట్స్

హైదరాబాద్: ‌తెలంగాణలో బుధవారం కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు (COVID-19 positive cases) నమోదయ్యాయి. ఈ 11 కరోనా కేసులు కూడా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల మొత్తం 1,107 కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న మరో 20 మంది నేడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 648 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 29 మంది కరోనా బారినపడి మృతి చెందారు. వరంగల్‌ (రూరల్‌), యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. 

Also read : Rain alert: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాల జాబితా ఇలా ఉంది. 
1) కరీంనగర్
2) సిరిసిల్ల
3) కామారెడ్డి
4) మహబూబ్ నగర్
5) మెదక్
6) భూపాలపల్లి
7) సంగారెడ్డి
8) నాగర్ కర్నూలు
9) ములుగు
10) పెద్దపల్లి
11) సిద్ధిపేట 
12) మహబూబాబాద్
13) మంచిర్యాల 
14) కొత్తగూడెం- భద్రాద్రి
15) వికారాబాద్
16) నల్గొండ
17) ఆసిఫాబాద్
18) ఖమ్మం
19) నిజామాబాద్
20) ఆదిలాబాద్
21) సూర్యాపేట
22) నారాయణపేట

Also read : బస్సుల కోసం వెయిటింగా ? ఇదిగో గుడ్ న్యూస్

జిల్లాల వారీగా నేడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఇలా ఉంది
1) హైదరాబాద్ - 10
2) సూర్యాపేట - 2
3) వికారాబాద్ - 1
4) ఖమ్మం - 1
4) ఆదిలాబాద్ - 2
5) మేడ్చల్ - 1
6) నిర్మల్  - 1
7) గద్వాల్  - 2

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News