టీవీ ఛానెల్ ఎడిటర్‌పై టాలీవుడ్ ఫిర్యాదు

టాలీవుడ్ ప్రతినిధులు శనివారం ఓ తెలుగు టీవీ ఛానెల్‌ ఎడిటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Last Updated : Mar 25, 2018, 04:50 PM IST
టీవీ ఛానెల్ ఎడిటర్‌పై టాలీవుడ్ ఫిర్యాదు

టాలీవుడ్ ప్రతినిధులు శనివారం ఓ తెలుగు టీవీ ఛానెల్‌ ఎడిటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా ఇండస్ట్రీ గురించి, అందులో పనిచేసే నటులు , మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఆ ఎడిటర్‌పై కేసు ఫైల్ చేశారు. 

ప్రత్యేక హోదాపై టాలీవుడ్ స్పందించదా? అంటూ ఇటీవలి కాలంలో తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే మాటలు మార్చే రాజకీయ నాయకులే ముందు మారాలి అంటూ.. పోసాని తనదైన శైలిలో రాజేంద్రప్రసాద్‌పై మండిపడ్డారు.

ఈ విషయంపై పోసానితో లైవ్ డిబేట్‌‌‌ను నిర్వహించిన ఓ చానెల్ ఎడిటర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడారంటూ చిత్ర పరిశ్రమ మండిపడింది. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఆ ఎడిటర్ చేసిన ఆరోపణలపై కన్నెర్ర జేసింది. సినిమావాళ్లని తక్కువ చేసి మాట్లాడారని మా అధ్యక్షుడు శివాజీ రాజా అధ్యక్షతన నటీనటులంతా ఆ ఎడిటర్‌పై కేసు ఫైల్ చేయించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలో టాలీవుడ్‌ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్‌ తదితరులు ఉన్నారు.

Trending News