లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి దుర్మరణం

అతివేగం మూడు నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

Last Updated : Mar 16, 2020, 06:51 AM IST
లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి దుర్మరణం

మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ వ్యాన్ గంభీరావుపేటకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొట్టింది.

See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులను గంభీరావుపేట మండల వాసులుగా గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని క్రైమ్ కథనాల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News