Telangana Weather Forecast: తెలంగాణలో నిన్న మొన్నటి వరకు వర్షాలతో కాస్తంత చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. రోహిణి కార్తె ప్రభావం ఈ సారి అంతగా లేకపోవచ్చనే అంచనాలు వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం నుంచి రోహిణి కార్తె మొదలు కానుంది. అపుడు రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి. కానీ వాతావరణ శాఖ చెప్పిన చల్లిటి కబురుతో తెలంగాణ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం రాగల మూడు రోజుల వరకు వాతావరణానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.
నిన్న పశ్చిమ మధ్య బంాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు ఉదయం నార్త తమిళనాడు, సౌత్ ఆంధ్ర తీరానికి సమీపంలోని నైరుతి మరియు దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంాళాఖాతంలో ఒక అల్ప పీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టం నుండి 7.6 కి. మీ ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈనెల 24వ తేదిన మధ్య బంగాళాఖాతం ప్రాంతం లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిక్కులోనే కదులుతూ మరింత బలపడి ఈనెల 25 వ తేదీకి ఈశాన్య మరియు దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళా ఖాతం ప్రాంతానికి చేరుకొనే అవకాశం ఉంది. నైఋతి ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం , మరియు ఉత్తర మధ్య బంగాళాఖతంలోని కొన్ని ప్రాంతాల లోకి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈ రోజ రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter