TSPSC Group Exams 2024: నిరుద్యోగులకు మరో తీపికబురు.. గ్రూప్ 1,2,3 ఎగ్జామ్స్ తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..

Government Groups Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ల తేదీలను ప్రకటించింది. ఎన్నో నెలలుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ల షెడ్యూల్ లను ప్రకటించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 6, 2024, 06:26 PM IST
  • నిరుద్యోగులకు మరో తీపికబురు..
  • గ్రూప్ 1,2,3 ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..
TSPSC Group Exams 2024: నిరుద్యోగులకు మరో తీపికబురు.. గ్రూప్ 1,2,3 ఎగ్జామ్స్ తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..

TSPSC Announces Group 1, 2 Group3 Exam Dates: తెలంగాణలో కొలువుల కోసం ఎన్నోఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ తీపికబురు ఇచ్చింది. బుధవారం రోజున టీఎస్పీఎస్సీ కమిషన్.. గ్రూప్ 1, గ్రూప్2. గ్రూప్ 3 ఎగ్జామ్ ల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇప్పటికే 563 పోస్టులకు గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ ను మరల విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 9 న ప్రిలిమినరీ ఎగ్జామ్, అక్టోబరు 21 న మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గ్రూప్ 2, 783 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీలలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది. అదే విధంగా.. గ్రూప్ 3 1,388 పోస్టులకు నవంబరు  17,18 తేదీల్లో ఎగ్జామ్ ల నిర్వహన చేపట్టనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇదిలా ఉండగా గ్రూప్ 2 ఎగ్జామ్ కు 5.51 లక్షల, గ్రూప్  3 ఎగ్జామ్ కు 5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.  

Read More: Karnataka Water Crisis: నా ఇంట్లోనే బోర్ ఎండిపోయింది ఏం చేయమంటారు!.. నీటికోరతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం..

ఈ క్రమంలో ఎగ్జామ్ ల తేదీలు వెలువడటంతో నిరుద్యోగులు సీరియస్ గా మరోసారి తమ ప్రిపరేషన్ ను కొనసాగిస్తున్నారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు తనదైన స్టైల్ లో పాలన కొనసాగిస్తుంది. దీనిలో భాగంగా.. ఉద్యోగాల కల్పనపై కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

ఇప్పటికే సీఎం అనేక సమావేశాలలో ఎగ్జామ్ తేదీల గురించి ఆలోచించకుండా, సీరియస్ గా చదువుకోవాలిని నిరుద్యోగులకు సూచించారు. ఇక ఇప్పుడు ఎగ్జామ్ ల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో నిరుద్యోగులు ఎలాగైన ఈసారి సర్కారు కొలువు సాధించాలని తమ ప్రిపరేషన్ ను కొనసాగిస్తున్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News