Telangana: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్ధి పార్టీనే కాకుండా అధికార పార్టీ మాటల్లో కూడా ఎన్నికల ప్రస్తావన రాకనే వస్తోంది. టీఆర్ఎస్ లెజిస్టేటివ్ పార్టీ సమావేశంలో ఇదే ప్రముఖంగా విన్పించింది.
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక కంటే సాధారణ ఎన్నికల వేడే ఎక్కువగా కన్పిస్తోంది. ప్రతిపక్షపార్టీలు కాంగ్రెస్, బీజేపీల నోటి నుంచి కాకుండా అధికార పార్టీ నుంచి కూడా ఎన్నికల ప్రస్తావన వస్తోంది. కీలకమైన టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో 41 శాతం ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ఒక్కొక్క గ్రామానికి ఇద్దరేసి ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి..నేరుగా పర్యవేక్షించే బాధ్యతలు తీసుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో సిట్టింగులకే మరోసారి సీట్లు కేటాయించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అందుకే ఓపికగా, జాగ్రత్తగా ఇప్పట్నించే పని చేయాలని సూచించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే..72-80 సీట్లను టీఆర్ఎస్ దక్కించుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని కేసీఆర్ తేల్చిచెప్పారు. బీజేపీకు భయపడే ప్రసక్తే లేదని..మహారాష్ట్ర తరహా ప్రయత్నాలు రాష్ట్రంలో ఫలించవని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు దిగుతున్న బీజేపీకు భయపడవద్దని కేసీఆర్ సూచించారు.
మరోవైపు ప్రగతి భవన్‌లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన జూలకంటి రంగారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తదితరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదని చెప్పారు. మతం పేరిట విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించేవారిని తిప్పికొట్టేందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.
Also read: September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook