Telangana Weather Updates: తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పగటి పూట ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరగా... వర్షాల కారణంగా 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గవచ్చునని తెలిపింది. కొన్ని జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు దిగి వస్తాయని పేర్కొంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, సిద్ధిపేట, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మెదక్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3, 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది.
హైదరాబాద్‌లో భారీ ఈదురు గాలులు :
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం (ఏప్రిల్ 21) వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గంటకు 40-50కి.మీ వేగంతో భారీ ఈదురు గాలులు వీచాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలపై పడటంతో విద్యుత్ అంతరాయం తలెత్తింది. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పెద్ద అంబర్ పేట ప్రాంతంలో ఓ భవనం ఐదో అంతస్తు గోడ కూలడంతో ఓ వృద్ధురాలికి గాయాలయ్యాయి.
భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను బెంగళూరు, నాగ్‌పూర్‌కు మళ్లించారు. రాత్రి 8 గంటల తర్వాత విమాన రాకపోకలు తిరిగి యథావిధిగా సాగినట్లు తెలుస్తోంది. నగరంలో గురువారం తిరుమలగిరిలో గరిష్టంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూసాపేటలో అత్యధికంగా 16.33 మి.మీ వర్షం కురిసింది.
Also Read: Horoscope Today April 22 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారిని తెలియని భయం కలవరపెడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.