Minister Harish Rao: తెలంగాణపై వివక్ష దేనికీ..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం..!

Minister Harish Rao: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. నీతి ఆయోగ్‌పై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 7, 2022, 05:46 PM IST
  • తెలంగాణలో రాజకీయ వేడి
  • బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
  • తాజాగా మంత్రి హరీష్‌రావు ఫైర్
Minister Harish Rao: తెలంగాణపై వివక్ష దేనికీ..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం..!

Minister Harish Rao: నీతి ఆయోగ్‌ను రాజకీయాల కోసం బ్రష్టు పట్టించారని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలు దాట వేస్తున్నారన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నిధులు కేటాయించామని ఐనా వాడుకోలేదని నీతి ఆయోగం చెప్పడం దారుణమన్నారు హరీష్‌రావు.

నీతి ఆయోగ్ ప్రకటన వాస్తవ దూరంగా ఉందని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు ఇవ్వకపోగా..కేంద్ర ప్రభుత్వానికే వంత పాడుతోందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల వైపు చూడటం లేదని చెప్పారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రంపై వివక్ష దేనికని ప్రశ్నించారు. 

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు. జల్ జీవన్ కింద తెలంగాణకు రూ.3 వేల 922 కోట్లు కేటాయించగా..కేవలం రూ.200 కోట్లు వాడుకున్నారని చెప్పడం అవాస్తవం తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం విస్మరించిందన్నారు. సేస్సులు తెచ్చిన రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకుండా చేశారని ఫైర్ అయ్యారు. గతంలో కొన్ని పథకాలకు 80 నుంచి 90 శాతం కేంద్ర సహాయం చేసిందని..ఇప్పుడా వాటా 60 శాతానికి తగ్గించి..రాష్ట్రాలపై భారం మోపుతున్నారన్నారు. 

పీఎం కిసాన్, సడక్ యోజన, ఐసీడీఎస్ తదితర అనేక పథకాల్లో కేంద్ర వాటా 60 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. దీని వల్ల 2018-19లో రాష్ట్రంపై రూ.2785 కోట్ల ఆర్థిక భారం పడిందన్నారు మంత్రి హరీష్‌రావు. నీతి ఆయోగ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నిన్న సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్‌కు నీతి లేకుండా పోయిందన్నారు. ప్రణాళికలు బదులు నీతి ఆయోగ్‌ రావడం వల్ల ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. అందుకే నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో యుద్ధం ప్రకటిస్తానని తెలిపారు సీఎం.

Also read:Heart Attack: చిన్న వయసులోనే గుండె జబ్బులు.. ఈ 7 నియమాలు పాటిస్తే మీ గుండె పదిలం..  

Also read:INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్‌ క్రికెట్‌లో మన అమ్మాయిలకు స్వర్ణం దక్కేనా..? రేపే తుది పోరు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News