Telangana Schools: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు! క్లారిటీ ఇచ్చిన మంత్రి సబిత

Telangana Schools: స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.

Written by - Srisailam | Last Updated : Jun 12, 2022, 09:54 AM IST
  • సోమవారం నుంచి తెలంగాణ స్కూళ్లు
  • సెలవుల పొడిగింపు లేదన్న విద్యాశాఖ
  • ఈనెల 31 వరకు బడిబాట
Telangana Schools: తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు! క్లారిటీ ఇచ్చిన మంత్రి సబిత

Telangana Schools: తెలంగాణలో మళ్లీ కొవిడ్ మహమ్మారి భయపెడుతోంది. గత వారం రోజులుగా కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.రోజుకు 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మరో రెండు, మూడు వారాలక వరకు కొవిడ్ విజృంభణ ఉంటుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరుగుతుండటం, హెల్త్ డైరెక్టర్ ప్రకటనతో తెలంగాణ జనాల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో జూన్ 13 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున తమ పిల్లలను స్కూల్ కు పంపాలా వద్దా అన్న ఆందోళనలో పేరెంట్స్ ఉన్నారు. స్కూళ్ల సెలవులు పొడిగిస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. స్కూల్ సెలవులను పొడిగించబోతున్నారని.. ఆదివారం సాయంత్రం వరకు విద్యాశాఖ నుంచి ప్రకటన వస్తుందనే ప్రచారం సాగింది.

స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే జూన్‌13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని చెప్పారు. వేసవి సెలవులు పొడిగిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. పలు జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్లను నడిపిస్తామని చెప్పారు. బడిబాట షెడ్యూల్ ను కూడా ప్రకటించింది విద్యాశాఖ. ఈనెల 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో క్లాసులు జరుగుతాయి.

Read Also: Tirumala Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30గం. సమయం...   

Read Also: Minor Gang Rape:బాలికను మొదట టచ్ చేసింది ఎమ్మెల్యే కొడుకే! గ్యాంగ్ రేప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News