Corona in Telangana: రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి- జీహెచ్​ఎంసీ పరిధిలో భారీగా కేసులు!

Corona in Telangana: రాష్ట్రంలో కొవిడ్​ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 4 వేలకు చేరులో కొత్త కేసులు నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 07:57 PM IST
  • తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
  • కొత్తగా నాలుగు వేలకు చేరువలో బాధితులు
  • మరింత తగ్గిన రికవరీ రేటు
Corona in Telangana: రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి- జీహెచ్​ఎంసీ పరిధిలో భారీగా కేసులు!

Corona in Telangana: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 3,944 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం గురువారం సాయంత్రం వెల్లడించింది.

మొత్తం 97,549 టెస్టులకుగానూ.. ఈ కేసులు (Telangana Corona update) నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య పెరిగింది.

ఇందులో 1,372 కేసులు ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే రావడం (Corona cases in GHMC) ఆందోళనకరం. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 259 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

బుధవారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు (గురువారం) సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,54,099 వద్దకు చేరింది.

రాష్ట్రంలో కరోనా రికవరీలు..

ఇక గడిచిన 24 గంటల్లో 2,444 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,07,498 మంది కరోనాను (Corona recoveries in Telangana) జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.20 శాతానికి తగ్గింది.

మహమ్మారికి రాష్ట్రంలో తాజాగా ముగ్గురు బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,081కు చేరినట్లు (Corona deaths in Telangana) ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 39,520 యాక్టివ్​ కొవిడ్ కేసులు (Corona Acitve cases in Telangana) ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,17,76,018 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,53,735 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 5,537 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని (Corona tests in Telangana) పేర్కొంది.

Also read: Night Curfew in Telangana: తెలంగాణలో త్వరలోనే నైట్ కర్ఫ్యూ!! జాతర తర్వాత కీలక నిర్ణయం!

Also read: Drugs case: హైదరాబాద్​లో డ్రగ్స్​ కేసు కలకలం- వెలుగులోకి వ్యాపారుల పేర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News