Corona in Telangana: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 2,398 మందికి పాజిటివ్

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో తాజాగా 2,398 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శుక్రవారం వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 09:04 PM IST
  • తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి
  • కొత్తగా 2,400 దిగువకు కొవిడ్ బాధితులు
  • 21 వేల పైకి యాక్టివ్​ కరోనా కేసులు
Corona in Telangana: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 2,398 మందికి పాజిటివ్

Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో తాజాగా 2,398 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శుక్రవారం వెల్లడించింది.

మొత్తం 68,525 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,05,199కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య కూడా భారీగా తగ్గింది.

మొత్తం కేసుల్లో ఎక్కువ భాగం ఒక్క హైదరాబాద్​లోనే నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగం వివరించింది.

గురువారం సాయంత్రం ఐదున్నర నుంచి నేటు సాయంత్రం 5:30  వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా మృతులు..

కొవిడ్​ కారణంగా తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,052కు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.57 శాతంగా ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో 1,181 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,79,471 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.35 శాతానికి తగ్గింది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 21,676 యాక్టివ్​ కొవిడ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,05,20,564 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,20,004 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 10,118 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.

Also read: Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?

Also read: Telangana Vaccination: తెలంగాణలో 5 కోట్ల మార్క్​ దాటిన కరోనా వ్యాక్సినేషన్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News