Telangana Rain Updates: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్...

Telangana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించనుంది.  నేటి ఉదయం 8.30 గం. నుంచి రేపటి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 24, 2022, 09:19 AM IST
  • తెలంగాణలో భారీ వర్షాలు
  • ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్
Telangana Rain Updates: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్...

Telangana Rain Updates: తెలంగాణవ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ఇవాళ్టి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ  ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వర్షాల కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ప్రగతి భవన్‌లో శనివారం (జూలై 23) కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేయాలని సూచించారు. గోదావరి నది మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 
 

Also Read: Horoscope Today July 24th : నేటి రాశి ఫలాలు.. ఈ 8 రాశుల వారికి శుభ దినం.. మంచి ఫలితాలు పొందుతారు..

Also Read: National Flag: ప్లాగ్ కోడ్‌లో కీలక మార్పులు..సవరణలకు కేంద్రం పచ్చజెండా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News