Telangana: రాజాసింగ్‌పై లీగల్ చర్యలకు పోలీసులు సిద్ధం

Telangana: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ పోలీస్ వివాదం రాజుకుంటోంది. పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కౌంటర్ ఇచ్చారు. లీగల్‌గా చర్యలు తీసుకుంటామంటున్నారు. 

Last Updated : Dec 22, 2020, 05:29 PM IST
Telangana: రాజాసింగ్‌పై లీగల్ చర్యలకు పోలీసులు సిద్ధం

Telangana: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ పోలీస్ వివాదం రాజుకుంటోంది. పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కౌంటర్ ఇచ్చారు. లీగల్‌గా చర్యలు తీసుకుంటామంటున్నారు. 

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Bjp Mla Rajasingh )‌పై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పోలీసులపై, డీజీపీపై కామెంట్లు చేయడం అందరికీ ఫ్యాషన్‌గా మారిందని సజ్జనార్ మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని సీపీ తప్పుబట్టారు.  పోలీసులపై బీజేపీ ( Bjp ) నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని..ఇష్టారాజ్యంగా మాట్లాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై లీగల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీపీ సజ్జనార్ ( CP Sajjanar ). 

ఇన్‌స్టంట్ లోన్లపై వచ్చిన ఫిర్యాదులపై సజ్జనార్ స్పందించారు. క్యాష్ మామా, లోన్‌జోన్, ధనాధన్ పేర్లతో రుణాలిస్తున్నారని..ఇన్‌స్టంట్ లోన్ల వ్యవహారాన్ని ఆర్బీఐ ( RBI ) దృష్టికి తీసుకెళ్లామని సజ్జనార్ తెలిపారు. రాయదుర్గంలో రెండు కంపెనీలను గుర్తించామని..ఇందులో 110 మంది టెలీ కాలర్స్ పని చేస్తున్నారని చెప్పారు. ఆరుగురు కంపెనీ నిర్వాహకుల్ని అరెస్టు చేశామన్నారు. ల్యాప్‌టాప్‌లు, 22 ఫోన్లు, 18 బ్యాంక్ అకౌంట్లలో 1.52 కోట్ల డబ్బు సీజ్ చేశామని చెప్పారు. 

Also read: Pawan Kalyan-Rana: అదిరిపోయే కాంబినేషన్.. పవన్ మూవీలో రానా

Trending News