Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల దూకుడు రాజకీయాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంపై తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ స్వాహా చేస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై కమలం నేతలు ఫైరవుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Jun 24, 2022, 07:15 AM IST
  • చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి
  • యువకులను కలవనున్న రేవంత్
  • అగ్నిపథ్ అల్లర్ల కేసులో యువకులు అరెస్ట్
Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల దూకుడు రాజకీయాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంపై తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ స్వాహా చేస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై కమలం నేతలు ఫైరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ వరుస ఆందోళన కార్యక్రమాలతో జనంలోకి వెళుతోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్, ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళుతున్నారు. రేవంత్ జైలుకు ఎందుకు వెళుతున్నారు? ఆయనపై ఏ కేసు నమోదైంది? అని అలోచిస్తున్నారా.. అయితే మీరు విన్నది నిజమే.

రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తున్నది నిజమే.. కాని కేసులో అరెస్టై నిందితుడిగా మాత్రం కాదు.  ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండకు సంబంధించి నమోదైన కేసులో అరెస్టయిన యువకులతో ములాఖత్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి  జైలుకు వెళ్తున్నారు.శుక్రవారం చంచల్ గూడ జైలుకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఆర్మీ అభ్యర్థులను కలవనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో అరెస్టైయిన యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గతంలో ప్రకటించారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్నిట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లర్ల కేసులో అరెస్టయిన యువకుల కోసం అడ్వకేట్లను నియమిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. జైలులో నిందితులతో సమావేశం తర్వాత.. వాళ్ల కోసం ఏంచేయాలన్న దానిపై పీసీసీ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. గత నెలలో కూడా చంచల్ గూడ జైలుకు వెళ్లారు రేవంత్ రెడ్డి. పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్ కు పంపించిన ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు. ఇక అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ్ పేరుతో నిరసన కార్యక్రమాలను చేపట్టబోతోంది.

Also read : UPSC Prelims Result-2022: సివిల్స్‌-2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల..అభ్యర్థులు వీరే..!

Also read :  మద్యం మత్తులో మరో యువతి మెడలో దండేసిన వరుడు.. వధువు ముందే చెప్పు దెబ్బలు! చివరికి ఏమైందంటే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News