Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. గతం కంటే ఘనం..

Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా  భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద షాక్ తగిలింది. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం చెప్పుకోదగ్గ పరిణామం. ఈ సారి తెలంగాణలో బీజేపీకి గతంలో కంటే 4 సీట్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2024, 02:56 PM IST
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. గతం కంటే ఘనం..

Telangana Lok Sabha Elections 2024: అబ్ కీ పార్ 400 పార్ అన్న బీజేపీ నినాదం ఈ సారి ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎన్టీయే కూటమితో కలిపి 300 సీట్లకు అటు ఇటుగా ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో బీజేపీ మంచి పర్ఫామెన్స్ కనబరిచింది. అంతేకాదు ఏపీలో కూటమితో కలిపి ఎన్టీయే 21 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ అక్కడ నర్సాపురం, అనకాపల్లి, రాజమండ్రి ఎంపీ సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన సీట్లతో పాటు మరో 4 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా ఈ సీట్లు గెలవడం లాంఛనమే అని చెప్పాలి.

ఇక గతంలో గెలిచిన ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్ గిరి స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి బీజేపీ తరుపున ఈటెల రాజేందర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పై 2,91,455 పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ నుంచి ఈటెల గెలుపు లాంఛనమే.

మరోవైపు సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి .. కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్ పై 57,253 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి డీకే అరుణ .. 9 వేల ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు బీజేపీ సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్ లో గొడెం నగేష్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆత్రం సుగుణ పై 78 వేల ఆధిక్యంలో ఉన్నారు. అటు నిజామాబాద్ స్థానంలో బీజేపీ సిట్టింగ్ అభ్యర్ధి ధర్మపురి అరవింద్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జీవన్ రెడ్డి పై 1లక్ష 28 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

చేవేళ్ల పార్లమెంట్ స్థానంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తన సమీప క్రాంగెస్ పార్టీ అభ్యర్ధి అయిన రంజిత్ రెడ్డిపై లక్ష 20 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ 1,66,077 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మెదక్ పార్లెమంట్ స్థానంలో బీజేపీ అభ్యర్ధి మాధవనేని రఘునందన్ రావు సమీప కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధుపై 38 వేల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా 17 లోక్ సభ స్థానాల్లో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సమాన స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా తెలంగాణలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించబోవడం ఖాయమనే విషయం ఈ ఎన్నికలతో స్పష్టమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News