KTR TWEET: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. దేశ, అంతర్జాతీయ సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. రాష్ట్రానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతుంటారు. విపక్షాలను ఆ వేదిక నుంచే టార్గెట్ చేస్తుంటారు. కాని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి థ్యాంక్స్ చెబుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. బీజేపీ జాతీయ నేతలు కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. అటు కమలనాథులకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు గులాబీ లీడర్లు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెబుతూ కేటీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.
అయితే కేటీఆర్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పింది ఏదో మంచి చేశారని కాదు.. సెటైరిక్ గా ప్రధానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధినేతగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని నియమించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు అంటూ తాజాగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మోడీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు అంటే మోడీ - ఈడీయేనని వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరనసలు తెలిపింది. దీనిపై స్పందించిన బండి సంజయ్ ఈడీ ముందు తప్పుచేసిన వాళ్లు అంతా సమానమేనన్నారు. సోనియా గాంధీలాగే తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ కామెంట్ చేశారు. బండి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే కేటీఆర్ ఈ సెటైరిక్ ట్వీట్ చేశారు.
Dear @PMOIndia
Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also 👏👏
Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty
— KTR (@KTRTRS) July 22, 2022
ఆదాని అంశంపైనా మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం మారిపోయిందన్నారు. మోడీ పాలనలో పేదరికంలో భారత్ నైజీరియాను అధిగమించిందని చెప్పారు. ఇదే సమయంలో బిల్ గేట్స్ ను అధిగమించి అదానీ ప్రపంచంలోనే నాలుగో కుబేరుడిగా అవతరించారని తెలిపారు. భారత్ కు సంబంధించి ఇవి రెండు కఠోర వాస్తవాలని కేటీఆర్ అన్నారు.
Harsh reality of 2 Indias 👇
❇️ India overtakes Nigeria as the world’s poverty capital
❇️ Adani becomes 4th richest in the world overtaking Bill Gates#ModiGovt #Priorities pic.twitter.com/5B2OoE2ce3
— KTR (@KTRTRS) July 22, 2022
సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కేంద్ర రైల్వేశాఖ ఎత్తివేయడంపైనా తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే కాదని విధి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బాధాకరమని కేటీఆర్ కామెంట్ చేశారు. సీనియర్ సిటిజన్ల విషయంలో కరుణా హృదయంతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తన ట్వీట్ లో కోరారు మంత్రి కేటీఆర్.
Dear @AshwiniVaishnaw Ji,
Taking care of our elderly people is not just a responsibility but our duty
Was saddened to read that Govt of India has decided to remove the senior citizen concession in train fares
Request you to review the decision & take a compassionate view pic.twitter.com/gkCWD3yI3q
— KTR (@KTRTRS) July 22, 2022
Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక
Read also: CBSE 12th results 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook