Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిన నేపథ్యంలో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
కరోనా కారణంగా నేరుగా తరగతులు నిర్వహించకపోవడం.. తొలుత పరీక్షలను రద్దు చేసిన సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించడం వంటి పరిస్థితుల్లో విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారని వాదనలు వినిపించాయి.
ఇలాంటి వార్తల నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గత పరీక్షల్లో ఫెయిల్ వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఏప్రిల్ వార్షిక పరీక్షల్లో మరోసారి పరీక్ష రాయోచ్చని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని జలీల్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏమైనా అనుమానాలుంటే ఫీజు చెల్లించి జవాబు పత్రాలు పొందవచ్చని చెప్పారు.
ఇటీవలే విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. దీంతో తాజాగా ఇంటర్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఊరటనిచ్చింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
ALso Read: Car Accident at Gachibowli: గచ్చిబౌలిలో కారు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి
Also Read: Teacher Suicide: కాలేజీలో కామ క్రీడలు.. రాసలీల వీడియో వైరల్- లేడీ టీచర్ ఆత్మహత్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook