Mahalakshmi Scheme Gay Cylinder: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తనదైన మార్కుతో ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా, మరో రెండు గ్యారెంటీలను అమలు అధికారులు చర్యలు చేపట్టారు. ‘మహాలక్ష్మీ’ పథకంలో భాగంగా ఈ నెల 27వ తేదీన రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను అందేలా పథకం ప్రారంభించానున్నారు.
ఈ పథకంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో తెలంగాణ సివిల్ సప్లై అధికారులు అనేక సూచనలను చేసింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ డెలీవరిఅయ్యిన సమయంలో పూర్తి అమౌంట్ ను చెల్లించాలి. ఆ తర్వాత 500 పోను మిగతా అమౌంట్ లబ్ధిదారుల అకౌంట్ లో జమఅవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ రూ.955 గా ఉంది. తెలంగాణలో కొన్నిచోట్ల సిలిండర్ ధరల్లో స్వల్పమైన మార్పులుండవచ్చు. ట్రాన్స్ పోర్టు ధరల్లో హెచ్చు, తగ్గుల వల్ల ఈ ధరలలో వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం.. ఉజ్వల పథకం కింద11.58 లక్షల మంది ఉండగా.. వారందరినీ కూడా మహాలక్ష్మీ పథకంలోకి చేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నుంచి ప్రతి సిలిండర్ కు రూ. రూ.340 రాయితీ లభిస్తోంది.
Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..
ఈ రాయితీ పోనూ.. మిగతా మొత్తం, అదనంగా రవాణా ఛార్జీలు కూడా పడకుండా.. ఆ డబ్బునంతా ప్రభుత్వం భరిస్తుందన్న మాట. ఇదిలా ఉండగా.. ఆదివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈక్రమంలో వెంటనే పథకం అమలుకు గాను.. రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook