TS High Court: పోలీసులకు 'క్లాస్‌' తీసుకోవాలి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు సూచన

TS High Court Fire On Police Dept: పోలీసుల వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల విషయమై కీలక సూచనలు చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 11:06 PM IST
TS High Court: పోలీసులకు 'క్లాస్‌' తీసుకోవాలి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు సూచన

Telangana High Court: ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చే ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ప్రజల పట్ల పోలీసుల వైఖరి మారాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. ఈ సందర్భంగా విధులు, బాధ్యతల విషయమై పోలీసులకు కొన్ని సూచలను చేసింది. పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని వ్యాఖ్యానించింది. ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి కాదని స్పష్టం చేసింది. పోలీసుల ప్రవర్తన తీరు మార్చుకోవడం, వారి బాధ్యతలు, విధులను గుర్తుచేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి సూచించింది.

Also Read: BRS Party MLAs: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. టచ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు

తనతో అనుచితంగా వ్యవహరించిన వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కరీంనగర్‌ రెండో పట్టణ పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ ఆరోపించింది. ఆ పోలీసులు తన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌పై శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారించింది. కోర్టు ఆదేశంతో కరీంనగర్‌ రెండో పట్టణ ఎస్‌హెచ్‌ఓ ఓదెల వెంకటేశ్ వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరయ్యారు.

Also Read: Organ Donor: సామాన్యులకు కూడా 'వీఐపీ' అంత్యక్రియలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఎస్‌హెచ్‌ఓను ప్రభుత్వ న్యాయవాది వెనకేసుకు రావడంపై హైకోర్టు ఆక్షేపించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకలేదంటూ ఇకపై ఎవరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా చూడాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు తప్పుడు ఆరోపణలు చేసినా కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యాక వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయి కదా అని పేర్కొంది. ఇకపై ఎవరి ఫిర్యాదును కూడా తిరస్కరించడం చేయొద్దని హితవు పలికింది.

బాధిత మహిళ తనను ఉద్యోగం నుంచి తొలగించిన విషయంలో కేసు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌కు రాగా.. పోలీసులు నిరాకరించారు. కోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 14వ తేదీన కేసు నమోదైంది. కేసు నమోదు కావడంతో పిటిషన్‌పై అభ్యర్థలను మూసివేస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ఎస్‌హెచ్‌ఓ వివరణ కోసం విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మహిళ కేసును నమోదు చేయకపోవడానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పోలీస్‌ శాఖకు ధర్మాసనం ఆదేశించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News