హైదరాబాద్: సమ్మెకి దిగిన టిఎస్ఆర్టీసీకి చెందిన రెండు గుర్తింపు సంఘాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అయితే, అంతకన్నా ముందుగా టిఎస్ఆర్టీసి కార్మిక సంఘాల చేత సమ్మెను విరమింపజేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జడ్జి రాజశేఖర్ రెడ్డి ఎదుట పిటిషనర్ తరపు న్యాయవాది, ప్రభుత్వం తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా లేవని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
ఇరువురి వాదనలు విన్న అనంతరం సమ్మెపై తదుపరి విచారణను పదో తేదీకి వాయిదా వేసిన జడ్జి.. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీకి ఆదేశించారు. ఈ క్రమంలోనే రెండు గుర్తింపు చెందిన కార్మిక సంఘాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.