ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

Last Updated : Nov 16, 2019, 10:30 AM IST
ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, వరంగల్‌ (తూర్పు), జనగాం, మల్కాజిగిరి ఎమ్మెల్యేల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వారి ఎన్నిక చెల్లదని ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు... ఈ పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేసింది. ఈ పిటిషన్లపై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసిన కోర్టు.. ఆ లోగా వారిని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. 

హై కోర్టు నుంచి నోటీసులు అందుకున్న వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు.

Trending News