Telangana High Court: కరోనా మహమ్మారి కట్టడి విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా సరే లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. ఆక్సిజన్ కొరత, మందులు, బెడ్స్ కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఆక్సిజన్ (Oxygen Shortage)లభించక ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ లేదా నైట్‌కర్ఫ్యూ అమలవుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana Government) హైకోర్టు ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే రాష్ట్రంలో పరీక్షల సామర్ధ్యం పెంచామని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు. ఒక్కరోజు కూడా లక్ష పరీక్షలు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు లాక్‌డౌన్ (Lockdown) దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ డేటాను పూర్తి వివరాలతో సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది.
Also read: Telangana Corona Cases: తెలంగాణలో మరోసారి 50కి పైగా కోవిడ్ మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook