Telangana Governor Tamilisai Soundararajan: కోవిడ్-19 టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై భర్త తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త సౌందర్ రాజన్ కోవిడ్-19 టీకా తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడుత కరోనా టీకాల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర గవర్నర తమిళిసై భర్త, ఫ్రంట్‌లైన్ వారియర్‌గా డాక్టర్ సౌందర్ రాజన్ కరోనా టీకా వేయించుకున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనలో భాగంగా కరోనా వ్యాక్సినేషన్‌లో భాగస్వామిగా మారిన తన భర్త సౌందర్ రాజన్‌ను గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) అభినందించారు. కరోనా టీకాలు వేయించుకునేందుకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రం అనుమతిస్తే వ్యాక్సిన్లు తీసుకోవడానికి ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు.
Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
కాగా, దేశవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్(Covaxin Latest Updates) కరోనా వ్యాక్సిన్లకు జనవరి నెలలో డీసీజీఏ అనుమతులు ఇచ్చింది. జనవరి 19 నుంచి దేశవ్యాప్తంగా ఈ రెండు టీకాల పంపిణీ జరిగింది. అదే రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం సైతం టీకాలు ఇస్తుంది. సౌందర్ రాజన్ కరోనా వ్యాక్సిన్ తీసుకుని ప్రజలలో కోవిడ్-19 టీకాపై నమ్మకాన్ని పెంచారని గవర్నర్ అన్నారు.
Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook