Telangana: తెలంగాణ నుంచి వినూత్న కార్యక్రమం, త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని సౌకర్యాల్ని వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. వన్ కార్డు ఆల్ నీడ్స్ వ్యవస్థను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2023, 07:54 PM IST
Telangana: తెలంగాణ నుంచి వినూత్న కార్యక్రమం, త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెడుతోంది. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఈ కార్డును జారీ చేయనున్న ప్రభుత్వం ఆ తరువాత రాష్ట్రమంతా విస్తరించనుంది. అసలు కామన్ మొబిలిటీ కార్డు అంటే ఏంటి, ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

తెలంగాణ ప్రభుత్వం త్వరలో కామన్ మొబిలిటీ కార్డును జారీ చేయనుంది. హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టనున్న ఈ కార్డుతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్, ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటో సేవలు వినియోగించుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే ప్రజా రవాణా వ్యవస్థ మొత్తాన్ని కలిపి ఉంచేలా పనిచేస్తుంది ఈ కామన్ మొబిలిటీ కార్డు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసీలు దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాయి. ప్రారంభదశలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలైన మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల్ని ఈ కార్డు ద్వారా వినియోగించవచ్చు.

ముందుగా మెట్రో రైల్ , ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు వీలుగా ఈ కార్డును జారీ చేయనుంది ప్రభుత్వం. ఆగస్టు 2 నాటికి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కామన్ మొబిలిటీ కార్డుతో భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో సేవలు సైతం వినియోగించుకోవచ్చు. ఇదే కార్డును త్వరలో ఇతర కార్డుల మాదిరిగా కొనుగోళ్లకు వినియోగించుకునే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వె చెబుతోంది. వన్ కార్డు ఆల్ నీడ్స్‌లా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. ఈ కార్డుతో దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించుకునేందుకు అవకాశమున్న ప్రతి చోటా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇతర నగరాల్లోని మెట్రో, ఆర్టీసీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. 

ఇప్పటికే కామన్ మొబిలిటీ కార్డుకు సంబంధించిన రాష్ట్ర మంత్రులు, కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‌లతో ఆర్టీసీ, మెట్రో అదికారులు పలు వివరాలు అందించారు. ఈ కార్డు ద్వారా కలిగే ఉపయోగాల్ని వివరించారు. త్వరలో జారీ చేయనున్న కామన్ మొబిలిటీ కార్డుకు ఓ పేరు సూచించాలని ప్రజల్ని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం

Also read; Maruti Suzuki EV: త్వరలో మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News