Ration Card e-Kyc: రేషన్ కార్డుల ఇ కేవైసీ గడువు పెంపు, ఎలా చేస్తారంటే

Ration Card e-Kyc: రేషన్ కార్డు హోల్డర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఈకేవైసీ గడువును మరోసారి పెంచింది. ఈకేవైసీ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2024, 07:41 AM IST
Ration Card e-Kyc: రేషన్ కార్డుల ఇ కేవైసీ గడువు పెంపు, ఎలా చేస్తారంటే

Ration Card e-Kyc: తెలంగాణలోరేషన్ కార్డుదారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా రేషన్ కార్డులకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ గడువు జనవరి 31తో ముగియనుంది. కానీ చాల రాష్ట్రాల్లో ఇంకా ఈ ప్రక్రియ పెండింగులో ఉన్నందున ఈకేవైసీ గడువును ఫిబ్రవరి వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో కూడా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కానందున ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ 75.76 శాతం పూర్తయింది. మరో నెలరోజులు గడువు పెంచడంతో వందశాతం ఈకేవైసీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

రాష్ట్రంలో అన్ని రేషన్ షాపుల్లో ఈకేవైసీ ప్రక్రియ జరుగుతోంది. కేవైసీ కోసం ఆధార్ కార్డు ధృవీకరణ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల్ని ఏరివేసేందుకు ఆధార్ కార్డుతో లింక్ చేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతా ఈకేవైసీ చేయించుకోవల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తయితే కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకోవచ్చు. 

రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలంటే కుటుంబసబ్యులంతా ఒకేసారి రేషన్ షాపుకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. వేలిముద్రల బయోమెట్రిక్ పూర్తయ్యాక ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఈపాస్‌లో డిస్‌ప్లే అవుతుంది. కుటుంబసభ్యులు వేర్వేరుగా వెళితే ఈకేవైసీ ప్రోసెస్ చేయడం కుదరదు. 

Also read: IPL 2024 Schedule: దశలవారీగా ఐపీఎల్ 2024 నిర్వహణ, తొలి దశ ఫిబ్రవరిలోనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News