Harish Rao: హ‌రీశ్ రావుకు వైద్యారోగ్య‌ శాఖ అద‌న‌పు బాధ్య‌త‌లు

Harish Rao : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 10:37 AM IST
Harish Rao: హ‌రీశ్ రావుకు వైద్యారోగ్య‌ శాఖ అద‌న‌పు బాధ్య‌త‌లు

Harish Rao : తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు (Telangana Health Minister) అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) వద్దనున్న వైద్యారోగ్యశాఖను ఆయనకు అదనంగా అప్పగించారు. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు.

అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్‌(Etala Rajender)పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైద్యారోగ్య శాఖను సీఎం తన వద్దనే అట్టిపెట్టుకున్నారు.

Also Read: Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

అంతకుమందు కేసీఆర్ కరోనా(Covid) బారినపడటం తర్వాత బిజీగా వుండటంతో హరీశ్ రావే(harish rao) వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు సమీక్షలను నిర్వహించారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. వైద్యారోగ్యశాఖను హరీశ్ రావుకు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో వైద్య రంగానికి కొత్తరూపునివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో.. వైద్యారోగ్య శాఖను హరీశ్‌రావుకు అదనపు బాధ్యతగా అప్పగించడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News