Beer Prices Hike: తెలంగాణలో మరింత ప్రియం కానున్న బీరు, 20 రూపాయల వరకూ పెంపు

Beer Prices Hike: తెలంగాణలో బీరు చేదెక్కనుంది. కిక్కు ఇస్తుందో లేదో గానీ..జేబులు గుల్ల కానున్నాయి. మందుబాబుల వేసవి దాహం కాస్త ఖరీదెక్కనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2022, 09:03 AM IST
  • తెలంగాణలో చేదెక్కనున్న బీరు, ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం
  • ఒక్కొక్క బీరుపై 10 రూపాయల్నించి 20 రూపాయల వరకూ పెంపు
  • ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరగడమే కారణం
Beer Prices Hike: తెలంగాణలో మరింత ప్రియం కానున్న బీరు, 20 రూపాయల వరకూ పెంపు

Beer Prices Hike: తెలంగాణలో బీరు చేదెక్కనుంది. కిక్కు ఇస్తుందో లేదో గానీ..జేబులు గుల్ల కానున్నాయి. మందుబాబుల వేసవి దాహం కాస్త ఖరీదెక్కనుంది.

తెలంగాణలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వేసవి దాహం తీర్చుకునే మందుబాబుల జేబులు మరింత భారమయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణలో బీరు కాస్త చేదెక్కనుంది. బీరు ధరల్ని పెంచేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. వాస్తవానికి బీరు ధరల్ని పెంచాలని చాలాకాలంగా డిస్టిలరీ యాజమాన్యాలు కోరుతున్నాయి. డిస్టిలరీ యాజమాన్యాల కోరిక మేరకు బీరు ధరల్ని కొద్దిమేర పెంచేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.

రాష్ట్రంలో ఒక్కొక్క బీరును 10 నుంచి 20 రూపాయల మేర పెంచనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లైట్ బీరు 140 రూపాయలు కాగా ఇక నుంచి 150 రూపాయలవనుంది. స్ట్రాంగ్ బీరు ధర 150 రూపాయలు కాగా ఇక నుంచి 170 రూపాయలు కానుంది. 

ఇంధన ధరలు క్రమం తప్పకుండా పెరుగుతుండటంతో పాటు ప్యాకింగ్, రవాణా ఖర్చులు ఎక్కువవడంతో బీరు ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు కోరుతున్నాయి. మరోవైపు బార్లీ ధర పెరగడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 

Also read: KTR's Achhe Din Tweet: అచ్ఛే దిన్ అంటే ఇదేనా..మంత్రి కేటీఆర్ ట్వీట్..ప్రధాని కౌంటర్.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News