హైదరాబాద్: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జాతీయ నేతలు, పార్టీల అధినేతలు తెలంగాణలో ప్రచారం చేసేందుకు క్యూకడుతున్నారు.ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, సోనియా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ఇంకా 8 రోజుల మాత్రమే మిగిలి ఉంది. దీంతో మిగిలిన అగ్రనేతలు కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఈ రోజు మహాకూటమి తరఫున ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, చంద్రబాబు కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. రాహుల్, చంద్రబాబు ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తికంగా మారింది.
* మధ్యాహ్నం 12 గంటలకు కోండగల్ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగం
* మధ్యాహ్నం 2:30కి ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్, చంద్రబాబు
* సాయంత్రం 5:30కి అమిర్ పేటలో జరిగే బహిరంగ సభలో రాహుల్, చంద్రబాబు ప్రసంగం
* అనంతరం నాంపల్లిలో జరిగే రోడ్ షో లో పాల్గొనున్న రాహుల్ గాంధీ, చంద్రబాబు
రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఢిల్లీ నుంచి నేరుగా కొండగల్ చేరుకొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఖమ్మం జిల్లాకు చేరుకుంటారు. ఇక్కడ మధ్యాహ్నం 2:30కి జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాహుల్ తో పాటు చంద్రబాబు ఓకే వేదికను పంచుకోనున్నారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి సాయంత్రం 5:30కి హైదరాబాద్ లోని అమీర్ పేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నాంపల్లిలో నిర్వహిస్తున్న రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీకి పయనమౌతారు..చంద్రబాబు కూడా అమరావతికి పయనమౌతారు.