ts eamcet application last date extended: హైదరాబాద్: టిఎస్ ఎంసెట్ 2021 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీని మరోసారి పొడిగించినట్టు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. తాజాగా ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 17 వరకు గడువు పొడిగించడంతో పాటు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కన్వీనర్ గోవర్ధన్ ( TS Eamcet convener Prof. Govardhan) పేర్కొన్నారు.
Also read : TS inter second year exams cancelled: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై అధికారిక ప్రకటన
తెలంగాణ ఎంసెట్‌కు (Telangana EAMCET exams 2021) జూన్ 10 వరకు 2,20,027 దరఖాస్తులు రాగా అందులో 1,46,541 మంది స్టూడెంట్స్ ఎంసెట్, ఇంజినీరింగ్‌కు మరో 73,486 మంది అభ్యర్థులు అగ్రికల్చర్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించినప్పటికీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల తేదీలపై మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also read : TS Cabinet meeting important points: తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు