హైదరాబాద్ : ప్రతీ ఏడాది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక షెడ్యూల్ ప్రకారం జరిగే ఎంసెట్, ఈసెట్ లాంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఈసారి లాక్ డౌన్ కారణంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జారీ ఆదేశాల ప్రకారం మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుండగా.. ఒకవేళ మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తే పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు చాలా మంది విద్యార్థిని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న.
Also read : నా వాహనంలో మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా: వలస కూలీలకు మంత్రి హరీష్ రావు భరోసా
EAMCET, ECET exams: ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణపై సర్కార్ వైఖరి